Google pay loan : మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా.. అయితే మీరు 8 లక్షలు పొందవచ్చు.. ఇలా చేయండి


Google Pay Loan: మీరు గూగుల్ పే వాడుతున్నారా? అయితే గుడ్ న్యూస్. ఇలా చేస్తే రూ. 8 లక్షలు రుణం పొందొచ్చు. ఎలా చెల్లించాలో కూడా తెలుసుకోండి.
Google Pay Loan: ఈరోజుల్లో ఏ అవసరానికైనా ధనం మూల ఇంధనంగా మారింది. మరీ ముఖ్యంగా అప్పు తీసుకోకుండా అవసరాలు గట్టెక్కే మార్గం లేకుండా పరిస్థితులు తయారయ్యాయి. దీనికి తోడు టెక్నాలజీతో పాటు సాంకేతికతలో మార్పు కారణంగా అర చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నిల్చున్న చోటే డబ్బు పుట్టే సౌకర్యం కూడా వచ్చేసింది.
గతంలో మాదిరిగా బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీసుల్లో గంటల తరబడి నిలబడటం, డాక్యుమెంట్లు, షూరిటీ సైన్లతో పని లేకుండా ఫోన్ లోనే అప్పులు తీసుకునే రోజులు వచ్చేశాయి. మరీ ముఖ్యంగా మనీ పేమెంట్స్ యాప్ లలో బాగా ప్రాచూర్యం పొందినది..ఎక్కువ మంది ఉపయోగించే గూగుల్ పే యూపీఐ మంచి ఆఫర్లు అందిస్తోంది.
ఇప్పుడున్నవి ఇది వరకు రోజులు కాదు. లోన్, అప్పు, రుణం తీసుకోవాలంటే బ్యాంకులు చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు. అప్పు దానంతటకి అదే పుడుతుంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్నీ లోన్ యాప్స్ లో కొన్ని జనం నుంచి భారీగా వడ్డీలు వసులు చేసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
అయితే ప్రముఖ పేమెంట్ సర్వీస్ యాప్ గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్ అందిస్తోంది. గూగుల్ పే యూజర్లకు రూ.8లక్షల వరకు రుణం(Loan) తీసుకోవడానికి ఓ మార్గం చూపిస్తోంది.
ఈవిధంగా ఫోన్ ద్వారా గూగుల్ పేమెంట్ యాప్ సర్వీస్ లో తీసుకున్న పెద్ద మొత్తంలో రుణాన్ని ఒక్కసారిగా చెల్లించడం కాకుండా సులభమైన వాయిదా పద్దతుల్లో (EMI) ద్వారా లోన్ తిరిగి చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తుంది.
రుణం పొందడానికి కస్టమర్లు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. పేపర్ వర్క్ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా మాత్రమే రుణాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈవిధంగా లోన్ తీసుకువాలనుకునే వారికి సిబిల్ స్కోర్ మాత్రం కచ్చితంగా బాగుండాలన్నదే ఏకైక కండీషన్.
ఈ లోన్ పొందడానికి గూగుల్ పే యూజర్స్ ఫస్ట్ Google Pay యాప్కి వెళ్లాలి. ఆ తర్వాత ఆఫర్స్ అండ్ రివార్డ్స్ ఆప్షన్లోకి వెళ్లి మేనేజ్ యువర్ మనీ ఆప్షన్పై క్లిక్ చేయండి. అక్కడ కనిపించే లోన్ ఆప్షన్పై క్లిక్ చేసి అవసరమైన మొత్తం వివరాలను అందించండి.
అటుపై అప్లై నవ్ (Apply Now) ఆప్షన్పై క్లిక్ చేయండి. చివరగా కొత్త పేజీ లోన్ వివరాలను చూపుతుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన ఖాతాకు లోన్ మొత్తం వెంటనే జోడించబడుతుంది. రుణంపై వడ్డీ రేటు 13.99 శాతం. రుణాన్ని 6 నెలల నుండి 4 సంవత్సరాల వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు.

See also  Post Office MIS Scheme: ఒక్కసారి పెట్టుబడితో నెలనెలా రాబడి.. పోస్టాఫీసు అందించే అద్భుత పథకం ఇదే..!