Apple iphone 14: ఆపిల్ ఫోన్ పై భారీ ఆఫర్.. ఏకంగా రూ:16,599తగ్గింపు..!


Apple iphone 14: ప్రస్తుత మార్కెట్ లో మొబైల్ ఫోన్స్ హవా నడుస్తోంది.
ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆపిల్. ఈ కంపెనీ ఫోన్ అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ మధ్యతరగతి ప్రజలు ఈ ఫోన్ కొనాలంటే చాలా కష్టమైన పని. కానీ అలాంటి వారికి కూడా ఫ్లిప్కార్ట్ ఆఫర్ ద్వారా తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ 14 మొబైల్ ను భారీ డిస్కౌంట్ లో అందిస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో పూర్తిగా చూసేద్దామా.. ఈ మొబైల్ 2022 లో లాంచ్ అయింది. అయితే ప్రస్తుతం వాలెంటెన్స్ డే సందర్భంగా మీ యొక్క ఇష్టమైన వ్యక్తికి బహుమతిగా ఫోన్ ఇవ్వాలనుకుంటే ఇది ఆఫర్ లో లభిస్తుంది.

Huge offer on Apple iphone 14

అయితే ఈ మొబైల్ లాంచ్ అయిన సమయంలో రూ:79,900 ధర ఉండేది. ఫ్లిప్కార్ట్ సేల్ లో భాగంగా ప్రత్యేకమైన తగ్గింపును అందిస్తున్నారు. మరి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇతర వివరాలు.. ఈ ఫోన్ A 15 బయోనిక్ చిప్ ప్రాసెసర్ తో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డిఆర్ డిస్ప్లే కలిగి ఉంది. ఐఫోన్ 14 ఇప్పటికే కొనుగోలుదారుల కోసం ఒక ప్రసిద్ధ ఎంపికగా పరిగణించబడింది. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ లో పాత స్మార్ట్ ఫోన్ కు బదులుగా రూ:54,900 వరకు తగ్గింపు అందిస్తోంది. అంటే ఒక వినియోగదారుడు తన యొక్క పాత మొబైల్ ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ని మార్చుకోవాలి అనుకుంటే దీని ధర రూ:16,599 కి పడిపోతుంది.
అంతేకాకుండా ఆపిల్ ఐఫోన్ 14 ప్రస్తుతం రూ:57,999రూపాయలకు అందుబాటులో ఉంది. అలాగే అధికారిక స్టోర్ ధర నుండి రూ:11,901 తగ్గింపు లభిస్తోంది. ఇతర ఈఎంఐ లావాదేవీల మీద కూడా రూ:1250 తగ్గింపు పొందవచ్చు. మొత్తానికి ఈ ఫోన్ ధర రూ:56,749కి తగ్గుతున్నది. అలాగే ఈ మొబైల్ 128 జీబీ నిల్వ కలిగినటు వంటి మోడల్ రూ:57,999 కి వస్తోంది. అంటే దీని అసలు ధర రూ:70వేలు. అంటే 17% తగ్గింపు లభిస్తోందన్న మాట. అంతేకాకుండా ఐఫోన్ 14 ఫ్లిప్కార్ట్ లో 256 జిబి మోడల్ రూ:64,999ఉన్నది.

దీని అసలు ధర రూ:74,900ఉండగా 14% తగ్గింపు లభిస్తోంది. కొనుగోలుదారుడు పాత ఫోన్ పై రూ: 54,900 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను పొందవచ్చు. అంటే దీని ధర రూ:10,099తగ్గుతుంది. అలాగే ఐఫోన్ 14, 512 జిబి మోడల్ ధర రూ:79,999 ఉండగా అసలు ధర రూ:90,900ఉన్నది. అంటే 12 శాతం తగ్గింపుతో మీ పాత ఫోన్ పై రూ:54,900వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ను పొందవచ్చు. అలాగే ఈ మొబైల్స్ కెమెరా విషయాలకు వస్తే 12mp ప్రధాన కెమెరా మరియు 12 ఎంపీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సిస్టం కలిగి ఉంది. అలాగే 3,279 ఎంఏహెచ్ బ్యాటరీ , 15W వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

See also  Onion Chutney : ఉల్లిపాయ పచ్చడి ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..
, ,