Anushka Shetty 42 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన అనుష్క శెట్టి… ఆ స్టార్ క్రికెటర్​తో..!


టాలీవుడ్ స్వీటీ అనగానే అభిమానులకు, ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులను అలరిస్తోంది.
‘బాహుబలి’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే 40 ఏళ్లు దాటిపోయినా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. గతంలో పలు రూమర్స్ వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఆమె పెళ్లి వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆమె ఓ క్రికెటర్​ను వివాహం చేసుకోబోతుందని అంతా మాట్లాడుకుంటున్నారు. దాని గురించే ఈ కథనం..
హీరోయిన్‌ అంటే రెండు సన్నివేశాలు, మూడు పాటలు మాత్రమే కాదు.. అవసరమైతే సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించగలం అని నిరూపించిన కథానాయిక అనుష్క శెట్టి. మొదట్లో అందాలు బాగానే ఆరబోసినా, ఆ తర్వాత ‘జేజమ్మ’, ‘రుద్రమదేవి’, ‘దేవసేన’, ‘భాగమతి’ వంటి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను పెంచుకున్నారు. ఇంకా చెప్పాలంటే లేడి ఓరియెంటెండ్​ సినిమా అనగానే.. అనుష్క పేరు గుర్తొచ్చేలా తన నటనతో ప్రేక్షకుల్ని మాయ చేశారు.

ఇక అనుష్క ప్రొఫెషనల్ లైఫ్​తో పాటు పర్సనల్​ లైఫ్ గురించి సోషల్​ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి.​ ముఖ్యంగా ఆమె పెళ్లి, రిలేషన్​ షిప్​ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి కుమారుడిని అనుష్క పెళ్లి చేసుకోనున్నారంటూ అప్పట్లో పలు వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. వీటిని కూడా అనుష్క అప్పట్లో ఖండించింది.

ప్రభాస్​తో పెళ్లి : అనుష్క హీరో ప్రభాస్ రిలేషన్‌లో ఉన్నారంటూ ఎప్పుడూ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. దీనిపై వీరిద్దరు స్పందించి తాము మంచి ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు. అయినప్పటికీ ఆ పుకార్లు ఎప్పుడూ వస్తూనే ఉన్నాయి. ఇలా ఇన్నేళ్ల నుంచి అనుష్క పెళ్లిపై ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉన్నా ఒక్కసారి కూడా అవి నిజం కాలేదు.
పెళ్లిపై నమ్మకం ఉంది : అయితే ఈ మధ్య అనుష్కనే స్వయంగా తన పెళ్లి గురించి మాట్లాడింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “వివాహ వ్యవస్థపై నాకు నమ్మకముంది. పెళ్లికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను” అని అనుష్క చెప్పుకొచ్చింది.

స్టార్ క్రికెటర్​తో : అయితే ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మళ్లీ అనుష్క పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఆమె ఓ క్రికెటర్‌తో పెళ్లికి సిద్ధమైనట్లు బయట కథనాలు వస్తున్నాయి. ఈ పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా ఓకే చెప్పుకున్నారని ఆ కథనాల్లో రాసి ఉంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

See also  Jayaprada : సినీ నటి జయప్రద అరెస్టుకు రంగం సిద్ధం..!
,