రెండో బిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ.. గుడ్‌న్యూస్ చెప్పిన కోహ్లీ.. ఏం పేరు పెట్టారో తెలుసా?


టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఫిబ్రవరి 15వ తేదీన అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
విరుష్క దంపతులు రెండవ సంతానంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బాబుకు ‘అకాయ్’గా నామకరణం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు ఇప్పటికే ‘వామిక’ మొదటి సంతానం ఉన్న విషయం తెలిసిందే. అనుష్క శర్మ ప్రెగ్నెంట్ కావడంతోనే విరాట్ కోహ్లీ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.

ఇక, విరాట్ కోహ్లీకి కొడుకు పుట్టడంతో రన్ మెషిన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చోటా విరాట్ ఆగయా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండవసారి తల్లిదండ్రులు కావడంతో సోషల్ మీడియా వేదికగా విరుష్క దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

See also  ఎలా ఆడేది గురూ నువ్వు ఇలా బాల్ వేస్తే.. బుమ్రా బౌలింగ్ తో బెన్ స్టోక్స్ కు దిమ్మదిరిగిపోయింది.. వీడియో !