జగన్‌కు మరో షాక్..వైసీపీకి బాలినేని గుడ్ బై…?


సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు , అసంతృప్తి నేతలు వరుసగా పార్టీని వీడుతుండగా , తాజాగా టికెట్ హామీ ఉన్న నేతలు సైతం వైసీపీని వీడుతున్నారు.
తాజాగా ఈ లిస్ట్‌లో పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు వినిపిస్తోంది.

ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం బాలినేనికి ఒంగొలు అసెంబ్లీ టికెట్ ఖారారు చేశారు. అయితే ఆయన తన టికెట్‌తో పాటు ,ఒంగోలు ఎంపీ సీటు విషయంలో పట్టుపడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు తిరిగి టిక్కిట్ ఇప్పించుకోవడానికి బాలినేని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

2019 ఎన్నికల ముందు మాగుంటను టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకురావడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. అయితే అభ్యర్థుల మార్పుల్లో భాగంగా మాగుంటకు టికెట్ లేదని పార్టీ అధిష్టానం చెప్పడంతో బాలినేని రంగంలోకి దిగారు. మాగుంట సీటు విషయంలో సీఎం జగన్‌తో బాలినేని పలుమార్లు భేటీ అయినప్పటికీ ఫలితం లేకపోయింది. మాగుంట స్థానంలో చెవిరెడ్డిని ఒంగోలు అభ్యర్థిగా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది.

దీనిపై మరోసారి సీఎం జగన్‌ను కలవడానికి సీఎంఓ కార్యాలయానికి వచ్చిన బాలినేనికి ఛేదు అనుభవమే ఎదురైందని తెలుస్తోంది. సీఎం బిజీగా ఉన్నారని కలవరని చెప్పడంతో బాలినేని నిరాశగా వెనుతిరగడం జరిగింది. ఈక్రమంలోనే మాగుంటకు సీటు లేదని వైసీపీ పెద్దలు బాలినేనికి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది.

మాగుంట అంశాన్ని తేల్చిసిన వైసీపీ అధిష్టానం నెల్లూరు, ఒంగోలు కొత్త ఇన్‌ఛార్జ్‌గా చెవిరెడ్డిని నియమిస్తున్నామని బాలినేనికి స్పష్టం చేశారట. దీంతో ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకు కాకుండా చెవిరెడ్డికి ఇస్తున్నారని సమాచారం అందుకున్న బాలినేని వైసీపీని వీడటానికి సిద్దపడినట్టుగా తెలుస్తోంది. వైసీపీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసిని బాలినేని ..మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని పార్టీ నేతలకు స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతుంది.

సీఎం పిలిచినా రాను అని బాలినేని ఖరాఖండిగా చెప్పేశారట. బాలినేనితో చర్చించడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన వైసీపీ నేతలకు అందుబాటులో లేరని సమాచారం. ఈ ఘటన అనంతరం ఆయన హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాద్ బయల్దేరారని తెలుస్తోంది.

By Naresh K Oneindia
source: oneindia.com

See also  BREAKING: రిపబ్లిక్ డే వేడుకల్లో గత BRS ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు..!