Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది..


Animal : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ ని ఆల్ఫా మేల్ క్యారెక్టర్ లో బోల్డ్ అండ్ వైల్డ్ గా చూపిస్తూ తెరకెక్కించిన సినిమా ‘యానిమల్’.
ఫాదర్ సెంటిమెంట్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేస్తూ రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ హీరోయిన్స్ గా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. గత ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 900 కోట్ల కలెక్షన్స్ ని నమోదు చేసింది.

ఇక ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఓటీటీలో మరో 8 నిమిషాల అదనపు సీన్స్ తో 3 గంటల 29 నిమిషాల రన్ టైంతో స్ట్రీమ్ కాబోతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో ఆ ఎక్స్‌ట్రా రన్ టైములో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయో అని ఆడియన్స్ లో ఆసక్తి నెలకుంది. ఇక ఈ ఆసక్తి నెట్‌ఫ్లిక్స్ తెరదించబోతుంది.
ఈ మూవీని జనవరి 26న అంటే రేపు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ టీం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలు కాబోతుంది. మరి ఎక్స్‌ట్రా సీన్స్ ఏంటో ఈరోజు నైట్‌కే చూసేయండి. అలాగే ఈ మూవీని థియేటర్స్ లో మిస్ అయ్యినవారు కూడా ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసి ఎంజాయ్ చేసేయండి.

See also  సొంత మల్టీఫ్లెక్స్ లో ‘గుంటూరు కారం’ షో క్యాన్సిల్?.. కారణం అదే.. వైరల్ అవుతున్న ఫోటో