ఏంటమ్మ జ్యోతి ఇలా ఎలా చేశావ్.. మొన్నమో కన్నీళ్ల సీన్‌.. నిన్నమో ఆస్పత్రి సీన్‌.. మరి ఇవాళ..?


మొన్న ఆంతా కన్నీళ్ల సీన్‌. నిన్నంతా ఆస్పత్రి సీన్‌ నడిచాయి. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ జ్యోతి కేసులో ఇవాళ ఏం జరగనుంది?
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ తర్వాత కటకటాల సీన్‌ రానుందా?.. లంచం తీసుకుంటూ సోమవారం నాడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయి, కళ్ల నిండా నీళ్లతో ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ ఆఫీసర్‌ జ్యోతి కనిపించిన సీన్‌ ఇది. మాసబ్ ట్యాంక్‌లోని తన ఆఫీసులో ఓ కాంట్రాక్టర్‌ నుంచి జ్యోతి 84 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజామాబాద్‌లోని గాజులరామారంలో జువైనల్ బాయ్స్ హాస్టల్ నిర్మాణం కోసం నిధులు శాంక్షన్ అయ్యాయి. అయితే ఆ బిల్లులపై సంతకం చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి, కాంట్రాక్టర్‌ నుంచి డబ్బు డిమాండ్‌ చేశారు. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం, వాళ్లు వల పన్ని జ్యోతిని అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి.

రూ 65 లక్షల నగదు.. 4 కిలోల బంగారం

ఆ తర్వాత మెహదీపట్నం లోని జ్యోతి నివాసంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులకు అవినీతి జ్యోతి అసలు స్వరూపం…65 లక్షల నగదు, 4 కిలోల బంగారం రూపంలో దర్శనమిచ్చింది. దీంతో జ్యోతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఏసీబీ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సోదాల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని జ్యోతి చెప్పడంతో ఆమెను ఉస్మానియా హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

నిలకడగా జ్యోతి ఆరోగ్యం

జ్యోతికి వైద్యులు…ఈసీజీ తీసి, బీపీ, బ్లడ్ టెస్టులు, షుగర్, గుండెకి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఆమెకు 2డీ ఎకో టెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం. ఇవాళ జ్యోతిని డిశ్చార్జ్‌ చేస్తామని ఉస్మానియా వైద్యులు చెబుతున్నారు. డిశ్చార్జి తర్వాత ఆమెను నాంపల్లి లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నారు ఏసీబీ అధికారులు..

See also  Fake Messages: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ పేరుతో మెసేజ్‌.. స్పందించారో దోచేస్తారు.!
,