మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి


టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాత పరీక్షలో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బెజ్జారపు మౌనిక ప్రథమ ర్యాంకు సాధించారు. శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో 450 మార్కులకు 348 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించారు. హైదరాబాద్‌లో బీఫార్మసీ, అస్సాంలో ఎంఫార్మసీ పూర్తిచేశారు. పంచాయతీ కార్యదర్శిగా ఆరు నెలలు పనిచేసి కేంద్రం నిర్వహించిన ఫార్మసిస్టు ఉద్యోగ పరీక్షలో ప్రథమ స్థానం సాధించి హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి ఎంపిక కావడంతో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మౌనికను పలువురు అభినందించారు.

See also  Ambhika IPS ,DCP Mumbai – పధ్నాలుగేళ్లకే పెళ్ళయింది… పద్ధెనిమిదేళ్ళు రాకుండానే ఇద్దరు బిడ్డలకు తల్లయ్యారు… ‘నేను ఇంకేం సాధించలేను’ అని ఆమె నిరాశపడలేదు… పట్టుదలతో పోరాడి ఐపిఎస్‌ సాధించారు. నార్త్‌ ముంబయి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 35 ఏళ్ల ‘ముంబయి సివంగి’ ఎన్‌.అంబిక విజయగాథ ఇది.