అధికార వైసీపీకి ఊరట.. ఎన్నికల విధులకు వారి నియామకానికి గ్రీన్ సిగ్నల్


వైసీపీకి స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల విధులకు గ్రామ సచివాలయ సిబ్బంది నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అటు వలంటీర్ల కేటాయింపుపైనా స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవచ్చని సీఈసీ సూచించింది. అయితే ఇంకు పూసే పని మాత్రం ఇవ్వాలని, ప్రతి పోలింగ్ బూత్‌లో ఒకరిని మాత్రమే ఉంచాలని స్పష్టం చేసింది. అటు వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశించింది. గతంలో బీఎల్వోగా పని చేసిన వారిని సైతం ఎన్నికల విధులకు తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఆదేశాలను కలెక్టర్లకు సీఈవో మీనా పంపారు.

కాగా ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. వైనాట్ 175 అంటూ అధికార పార్టీ వైసీపీ, వైనాట్ పులివెందుల అంటూ టీడీపీ, జనసేన పార్టీలు పోటీకి సిద్ధమతున్నాయి. అయితే ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను వినియోగించుకోవాలని అధికార పార్టీ వైసీపీ భావించింది. దీంతో ప్రతిపక్షనాయకులు అబ్జెక్షన్ చెబుతున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఎన్నికల విధులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.

See also   AP state Final Voters Lists 2024 DOWNLOAD