జనవరి 25న అరుదైన యోగం.. ఆ రోజున ఈ వస్తువులు కొంటే లాభాలే లాభాలు


జ్యోతిష్యశాస్త్రంలో గురు పుష్య నక్షత్రం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది మొదటి గురు పుష్య నక్షత్రం గురువారం రోజున గురు పుష్య యోగం ఏర్పడుతోంది.
ముఖ్యంగా ఆ రోజున శుభకార్యాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంతే కాకుండా గృహప్రవేశం, కొత్త పనులు కూడా మొదలు పెడతారు. గురు పుష్య నక్షత్ర సమయంలో ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల మీరు అధిక లాభాలను పొందుతారు.

శుభ ముహూర్త సమయం

ఈ గురు పుష్య నక్షత్రం శుభ ముహూర్తం జనవరి 25 ఉదయం 8:16 నుంచి మొదలయ్యి జనవరి 26న ఉదయం 10:28 వరకు ఉంటుంది. ఈ గురుపుష్య నక్షత్ర సమయంలో చాలా మంది బంగారు కొనుగోలు చేస్తారు.

ఈ పనులు చేయడం శుభప్రదం

1. ఈ రోజున గోల్డ్ కొనుగోలు చేయండి. ఇలా చేసిన వారికీ వ్యాపారాల్లో విపరీతంగా లాభాలు పెరుగుతాయి.
2. ఈ యోగం సమయంలో ల్యాండ్ కొనుగోలు చేయడం చాలామంచిది.

3. శెనగ పప్పు కొనడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. ఎందుకంటే దేవగురువు బృహస్పతి ఆరాధనలో పప్పు ప్రసాదం పక్కా ఉండాలి.

4. అలాగే పూజకు సంబంధించిన పుస్తకాలు, శంఖాన్ని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.

5. మేము ఏమి కొనకుండా పూజ చేస్తామనుకునే వాళ్లు.. శ్రీ సూక్తాన్ని పఠించాలి. ఇలా చేసిన వారికీ లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.

See also  Wash Clothes: రాత్రిపూట దుస్తులు ఉతకకూడదా.. ఉతికితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?